- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరికీ అందుబాటులో న్యాయం : జడ్జి టి.ఎస్.పి. భార్గవి
by Ratna Kumari |
దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలం దిశపేట గ్రామంలో న్యాయ సేవా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిఫ్ కోర్టు జడ్జి టి.ఎస్.పి. భార్గవి ఆధ్వర్యంలో

X
దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలం దిశపేట గ్రామంలో న్యాయ సేవా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిఫ్ కోర్టు జడ్జి టి.ఎస్.పి. భార్గవి ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కుమారి టి.ఎస్.పి. భార్గవి మాట్లాడుతూ అందరికీ న్యాయం, అందుబాటులో న్యాయం అనే నినాదంతో సమాజంలోని ప్రతి ఒక్కరికి న్యాయ చట్టాలపై అవగాహన కలగాలని సూచించారు. న్యాయ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలు ఉచిత ప్రభుత్వ న్యాయవాదుల సేవలు, న్యాయ సలహాలు మరియు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. రాములు,పార లీగల్ వాలంటీర్లు అయ్యల సంతోష్,రామకృష్ణ రెడ్డి, మండల లీగల్ సర్వీసెస్ పాల్గొన్నారు.
Next Story






