- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షంలోనూ ముంపు ప్రాంతాల్లో జుక్కల్ ఎమ్మెల్యే పర్యటన
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. ఎడతెరిపి లేకుండా క

దిశ, నిజాంసాగర్ : వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ఇన్ ఫ్లోగా 1,80,662 చేరుతుండడంతో 27 వరద గేట్లును ఎత్తి దిగువకు 2,20,256 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రాజెక్టును పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు.
నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె గ్రామంలో పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మహమ్మద్ నగర్ మండలంలోని తున్కిపల్లి గ్రామం రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైంది. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే, వెంటనే గ్రామ ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. పోలీసు, ఆరోగ్య, రెవెన్యూ అధికారులను అందుబాటులో ఉంచి, అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏలే.మల్లికార్జున్, ప్రజా పండరి, బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, తహసిల్దార్ సవైసింగ్, సీఐ తిరుపతయ్య, ఎస్ఐ శివకుమార్ తదితరులు ఉన్నారు.






