- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీకి జుక్కల్ ఎమ్మెల్యే ఘన స్వాగతం
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం అడూర్ నియోజకవర్గాన్ని సందర్శించారు.

X
దిశ, నిజాంసాగర్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం అడూర్ నియోజకవర్గాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఆయనకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఘన స్వాగతం పలికారు. అడూర్ నియోజకవర్గానికి ఏఐసీసీ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాహుల్ గాంధీకి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకత్వం మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.
Next Story






