- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ప్రజా ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల

దిశ : జుక్కల్ (నిజాంసాగర్) : ప్రజా ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శనివారం జుక్కల్ మండలంలోని హంగర్గా గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు సుమారు 300 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హంగర్గా గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్థులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత పదిహేనేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే నియోజకవర్గ అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోకుండా, కేవలం తన స్వలాభం మాత్రమే చూసుకున్నాడని, నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా మోసం చేసాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు మోసపోయి గోస పడ్డది చాలు, ఇక ఆలోచనతో అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిరంతరం పరితపిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ దేశాయి, గంగు నాయక్, శివానంద్, సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.






