రాజంపేటలో జనం ప్రభంజనం..

by Disha Web |
రాజంపేటలో జనం ప్రభంజనం..
X

దిశ, రాజంపేట : మండల కేంద్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. సరంపల్లి నుండి రాజంపేట వరకు పార్టీ కార్యకర్తలతో పాదయాత్ర చేశారు. కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నోటికి వచ్చిన అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాది బిడ్డలు అమరులైన 1,200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేశారు. జేఏసీ పెడితే జెండాలు పట్టినం, దోరవస్తే దండాలు పెట్టినం. ఫిరంగులై పేలినం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు గెలిపించినం. ఉద్యోగం ఉపాధి లేక నిరుద్యోగులు చస్తున్నారు.

అలాగే బీఆర్ఎస్ దొంగలకు పరీక్షలకు ముందే పరీక్ష పేపర్లు ఎలా అందుతున్నాయి అని అన్నారు. కెసీఆర్ కి పోయేకాలం వచ్చింది, 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం నుండి కేసీఆర్ చేస్తున్న పాపాలను యమధర్మరాజు కూడా మోయలేక పోతున్నాడు అని ఏద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కి గట్టి బుద్ది చెబుదాం, షబ్బీర్ ఆలీని మంచి మెజారిటీతో గెలిపించుకుందామని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు. శ్రమతో కష్టపడితే విజయం మనదే అని అన్నారు. ఇంతవరకు మండల కేంద్రానికి ఏ పెద్ద నాయకుడు రాలేదు. మొదటిసారిగా మండల కేంద్రానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రావడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఏ పెద్ద నాయకులు వచ్చిన జిల్లా కామారెడ్డి వరకే వచ్చేవారు అని మండల నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ రావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.Next Story