కామారెడ్డిలో జోరువాన

by Ratna Kumari |

కామారెడ్డి పట్టణంతో పాటు శివారు గ్రామాల్లో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.

కామారెడ్డిలో జోరువాన
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంతో పాటు శివారు గ్రామాల్లో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. నిన్న మొన్నటి వరకు సుమారు 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఎండ వేడిమితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒకసారిగా మూడు గంటల ప్రాంతంలో వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురు గారలతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. గ్రామాల్లో ప్రస్తుతం వరి పంటలు కోత దశకు ఉండడంతో వడగండ్ల వర్షంతో దాన్యం నేలరాలి పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో పట్టణ ప్రజలు ఎండ వేడిమికి తాళలేక ఉక్కిరిబిక్కిరి కాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.

Next Story