కేటీఆర్ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం స‌రికాదు : ఎమ్మెల్యే పోచారం

by Nallavelli.Anjaneyulu |

దిశ, బాన్సువాడ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌పై దుర్భాష‌లాడుతూ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

కేటీఆర్ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం స‌రికాదు : ఎమ్మెల్యే పోచారం
X

దిశ, బాన్సువాడ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌పై దుర్భాష‌లాడుతూ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం బాన్సువాడ‌ ప‌ట్ట‌ణంలోని ఎస్ఎంబీ గార్డెన్ లో 111 మంది స‌ర్పంచ్, ఉప స‌ర్పంచ్ అభ్య‌ర్థుల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సురేష్ శెట్కార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింద‌ని.. అభివృద్ధిని చూసి కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులు అధిక సంఖ్య‌లో విజ‌యం సాధించార‌ని తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ పదవీ రాజ్యాంగ బద్దమైన‌ద‌ని.. దాని విలువలు కాపాడాలని కోరారు. గ్రామస్తులు ఎంతో నమ్మక తో గెల్పించినందుకు వారి నమ్మాకాన్ని వమ్ము చేయకూడదని, గ్రామంలోని కావలసిన మౌలిక వసతులు కల్పించాలని త్రాగు నీరు, రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థలు చూసుకోవాలని సూచించారు. పనులు మీరు చేయాలి, నిధులు మేము సమకూర్చుతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం గ్రామాల‌ను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా నిధుల‌ను స‌మ‌కూర్చుతుంద‌ని, ఆ నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. మ‌రోవైపు కేటీఆర్ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాదున్నారు. తాను కేసీఆర్ కంటే కూడా ఐదు సంవ‌త్స‌రాలు పెద్ద అని.. అది ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నియోజక వర్గ స‌ర్పంచ్, ఉప‌స‌ర్పంచ్ లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Next Story