- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ పాట ఆవిష్కరణ
దిశ, కమ్మర్ పల్లి: మండల కేంద్రంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ' కోలమ్మ కోలో బతుకమ్మ

దిశ, కమ్మర్ పల్లి: మండల కేంద్రంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ' కోలమ్మ కోలో బతుకమ్మ కోలో ' అనే బతుకమ్మ పాట - 2025 పోస్టర్లను ఎస్సై జి అనిల్ రెడ్డి, ఎంఈఓ ఆంధ్రయ, ఐకెపి ఎపిఎం కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ అన్నారు. ఇలాంటి వేడుకలు సాంప్రదాయ విలువలను కాపాడటమే కాకుండా, కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని తెలిపారు. ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాం. కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాట నిర్మాత సుంకరి విజయ్ కుమార్, రచయిత కొత్తపల్లి సాగర్, సీసీలు రవి, భాగ్య, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.






