అన్నింట్లోనూ మహిళలు ముందుండాలి

by S Gopi |

అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలని పలువురు మహిళా ప్రతినిధులు కోరారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని... international women's day celebrations

అన్నింట్లోనూ మహిళలు ముందుండాలి
X

దిశ, కామారెడ్డి రూరల్: అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలని పలువురు మహిళా ప్రతినిధులు కోరారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు సరంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న జిల్లా న్యాయవాదులు శబనాబేగం, డాక్టర్ ప్రియాంక, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు రవళి, లావణ్య, ఆర్పీలు మంజుల, మమత తదితరులు పాల్గొని మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ సగభాగం మహిళలు ముందుండాలని, దేనిలోనూ వెనుకంజ వేయకూడదని అన్నారు. మగవారికి ధీటుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Next Story