- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంజాన్ వేళ జిల్లాపై ‘పోతరాజు’ డేగ కన్ను
రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సోమవారం జిల్లాలో నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణంలో పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 31: రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సోమవారం జిల్లాలో నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణంలో పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పికెట్స్, బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నుండి బోధన్ వెళ్లే ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయాన్నే పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెటింగ్, బందోబస్తును పర్యవేక్షించారు.
నగరంలో వివిధ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా పరిశీలించారు. నగరంలోని ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా ప్రార్ధన స్థలంలో ప్రజలకు నమాజ్ నిర్వహించే సమయంలో పటిష్టమైన బందోబస్తునేర్పాటు చేశారు. వన్ టౌన్ పి.ఎస్ పరిధిలోని కచ్చియా మసీద్ వద్ద పికెట్స్ ఏర్పాటులను తనిఖీ చేసి, ట్రాఫిక్ డైవర్షన్ ను సీపీ సాయిచైతన్య పరిశీలించారు. శంభుని గుడి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ తోపాటు పికెట్స్ ను కూడా సీపీ తనిఖీ చేశారు. టూ టౌన్ పీఎస్ పరిసర ప్రాంతాల్లో ఫుర్ట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అధికారులతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. బోధన్ లోని ఈద్గా బందోబస్తు, పికెట్స్ ఏర్పాట్లను, ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాట్లు క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి , నిజామాబాద్, బోధన్, ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి , శ్రీనివాస్ , ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐపీ లు ,ఎస్ఐ లు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






