ఇల్లులేని ప్ర‌తీ పేద‌వాడికి ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు చేయిస్తా : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

దిశ‌, బాన్సువాడ : ఇల్లులేని ప్ర‌తీ పేద‌వాడికి ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు చేయిస్తాన‌ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్సు

ఇల్లులేని ప్ర‌తీ పేద‌వాడికి ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు చేయిస్తా :  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ‌, బాన్సువాడ : ఇల్లులేని ప్ర‌తీ పేద‌వాడికి ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు చేయిస్తాన‌ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌ర్ని, రుద్రూర్, కోట‌గిరి పోతంగ‌ల్ మండ‌లాల‌కు చెందిన 57 డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల ల‌బ్ధిదారుల‌కు మొత్తం 1, 79, 17, 130 చెక్కుల‌ను ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ సొంత ఇంటి కలను నిజం చేయడం నా లక్ష్యం అని అన్నారు.నియోజక వర్గం లో ఇల్లు లేని ప్రతి పేదవారికి గూడు కల్పించడం తమ ఆశయం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పోతంగ‌ల్, కోట‌గిరి, రుద్రూర్, వ‌ర్ని మండ‌లాల ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Next Story