- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్ కాపీలను ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా
అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అధికారులు అందించలేకపోతున్నారు.

దిశ, నిజాంసాగర్ : అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అధికారులు అందించలేకపోతున్నారు. ఫలితంగా లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరిగిన కన్నీళ్లే మిగులుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఉత్తర్వులు వెలువడి 20 రోజులైనప్పటికి ప్రొసీడింగ్ కాపీలను అధికారులు అందజేయకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారుల ముందు ఆక్రోషం వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులు 20 రోజులు గడిచినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారులకు అందజేయకపోవడంతో విసుగెత్తిన ఓ లబ్ధిదారురాలు తాజాగా మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ముందు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంటానని కార్యాలయానికి తరలివచ్చింది. వివరాల్లోకి వెళితే నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో 13 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇళ్ల నిర్మాణాల ఉత్తర్వుల పత్రాల కోసం ఈనెల మూడో తేదీన ఎంపీడీవో కార్యాలయానికి 13 మంది లబ్ధిదారులు తరలి వచ్చారు.
ఉత్తర్వులు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఎంపీడీవో శివకృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన వడ్ల అమృత తనకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాపీని ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో అధికారులు శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 13 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉత్తర్వులను పంపిణీ చేయలేక లేకపోయారు. దీంతో విస్కెత్తిన మహిళ శుక్రవారం తాజాగా ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం అందించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఎంపీడీవోతో మొరపెట్టుకుంది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయితే అధికారులు పంపిణీ వాయిదా వేస్తున్నారని, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ఇంకెప్పుడూ చేపడతారు తామెప్పుడూ ఇల్లును నిర్మించుకోవాలని నిలదీశారు. మంజూరు పత్రాలు అందించకపోతే తమకు చావే గతేనని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ఉత్తర్వులను లబ్ధిదారులకు పంపించాలని కోరుతున్నారు.
మాగి గ్రామంలో 13 మందికి ఇందిరమ్మ ఇళ్లు..
మాగి గ్రామంలో 13 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఈనెల మూడో తేదీన లబ్ధిదారులు కార్యాలయానికి వచ్చారు. వారికి గురువారం పంపిణీ చేస్తామని చెప్పామని అనివార్య కారణాలవల్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయలేకపోయామని ఆయన అన్నారు. ఉత్తర్వులను పంపిణీ చేసే విషయాన్ని త్వరలోనే లబ్ధిదారులకు తెలియజేస్తామని అన్నారు.






