- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త..
తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోంది.

దిశ, ఆలూర్: తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే.. చాలా మంది లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణాలు ప్రారంభించలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన నిజామాబాదు జిల్లా యంత్రాంగం.. ఇండ్ల నిర్మాణాలు సాఫీగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
నిజామాబాదు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు ప్రారంభించలేని లబ్ధిదారులకు గ్రామ సమాఖ్య, స్త్రీనిధి మరియు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. లక్ష వరకు బ్రిడ్జి లోన్ ఇప్పించనుంది. మొదటి దశలో 2762 ఇండ్లు మంజూరయ్యాయి. నిర్మాణ దశల ప్రకారం ప్రభుత్వం రూ. 5 లక్షలు అందజేస్తుంది. లబ్ధిదారులు ముందుకు వస్తే వారికి లోన్ ఇప్పిస్తామని తెలిపారు.
నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి నిధులు లేని లబ్ధిదారులకు ఆర్థిక భారం లేకుండా చేసేందుకు జిల్లా యంత్రాంగం ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. గ్రామ సమాఖ్యలు, స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ. లక్ష వరకు బ్రిడ్జి లోన్ ఇప్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ లోన్ ఎలా పొందాలి, దాని వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయాలపై ఐకేపీ (ఇందిరా క్రాంతి పథకం) యంత్రాంగం లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తోంది.
నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరు...
ప్రభుత్వం జిల్లాలో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసింది. మొదటి విడత కింద ప్రతీ మండలం నుంచి ఒక్కొక్క గ్రామాన్ని గ్రామాన్ని ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 2762 ఇళ్లను మంజూరు చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత కూడా అర్హులైన వారు ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఒక్కోక్క ఇళ్లుకు 5లక్షల రూపాయలు మంజూరు చేయడంతో పాటు ఐదు విడతల్లో అందించేందుకు ఏర్పాట్లను చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుకను కూడా ఉచితంగానే అందిస్తుంది. మొదటి విడత కింద ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లలో 1150 ఇళ్లకు ముగ్గులు పోశారు. వీరిలో 210 మంది మాత్రమే బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేపట్టారు.ముగ్గులు పోసిన వారు కూడా పూర్తిస్థాయిలో ఇళ్లను నిర్మించేందుకు ముందుకు రావడం లేదు. నిబందనల ప్రకారం ఇళ్ల నిర్మాణానికి 600అడుగుల
వరకు నిర్మించుకోవచ్చని అనుమతులను ఇచ్చారు. ఇప్పటి వరకు బేస్‌మెంట్ వేసిన 95 మందికి
లక్ష రూపాయల చొప్పున నిధులను మంజూరు చేశారు. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైతే ఐదు విడుదల్లో 5లక్షల రూపాయలను అందిస్తారు. మొదటి విడత కింద బేస్‌మెంట్ పూర్తయితే అధికారులు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తారు. అదే రీతిలో గోడలు, స్తాబ్, ఇతర నిర్మాణాలు పూర్తిచేసిన తర్వాత విడతల వారీగా ఈ నిధులను వారి ఖాతాల్లో జమచేస్తారు. మొదటి విడతలో ఇప్పటికి సగం ఇళ్లు కూడా నిర్మాణం చేపట్టకపోవడంతో అధికారులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రెండో విడత కింద కూడా మిగతా ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లననే మంజూరు చేసినందున మొదటి విడత 31 గ్రామాలకు మంజూరు చేసిన ఇళ్లను మినహాయించి మిగతా ఇళ్లను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అర్హులను గుర్తించిన వారు క్రాస్ చెక్ చేస్తూ ఈనెల 12న రెండో విడత జాబితాను గ్రామాల వారీగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అధికారుల పరిశీలన ....
జిల్లాలో ఇళ్లను మంజూరు చెసినా నిర్మాణం చేపట్టకపోవడంతో వాస్తవ పరిస్థితులను గ్రామాల వారీగా పరిశీలించారు. లబ్ధిదారులు పేదలు కావడం, నిర్మాణం చేపట్రేందుకు తమ వద్ద డబ్బులు లేకపోవడం వల్ల ముగ్గులు పోసిన పనులను చేపట్టడం లేదు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణాలు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా పరిశీలించిన అధికారులు జిల్లా ప్రతినిధులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.ఇటీవలే జరిగిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు,ఇతర అధికారులతో జరిగిన సమీక్షసమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మహిళా గ్రూపుల్లో సభ్యులైతే వారికి ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు 50వేల నుండి 1లక్ష వరకు రుణం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల పరిధిలో ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఏపీఎంలు, డీపీఎంలతో పాటు ఆ శాఖ అధికారులు గుర్తించి వారు ఇళ్ల నిర్మాణం చేపట్టే విధంగా ప్రోత్సహించనున్నారు.వారికి బ్యాంకుల నుంచి 50వేల నుండి 1లక్ష వరకు రుణం ఇప్పించడంతో పాటు విడతల వారీగా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నరు. జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఉన్న మహిళా గ్రూపు సభ్యులకు రుణాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు. అర్హులైన" వారిని గుర్తించి రుణాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
మోతే సావిత్రి......పవన జ్యోతి సంఘం కల్లడి...
ప్రభుత్వ నిర్ణయం మేరకు మహిళా సంఘాల ద్వారా లోన్లు అందించడాన్ని హర్షతో స్వాగతిస్తున్నాను. ఈ చర్య వలన మా వంటి మహిళలకు ఆర్థికంగా ఎంతో సాయం అవుతోంది. ఈ సద్వినియోగ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి, మరియు సంబంధిత అధికారులకు నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం.... నిలగిరి శ్రీను..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, నిరుపేద కుటుంబాలకు మాత్రమే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా ఇళ్ల నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా లోన్లు మంజూరు చేయడం హర్షించదగిన విషయం. ఈ నూతన విధానానికి ప్రజల తరఫున ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.






