- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్పీ గడప తొక్కిన సర్పంచ్ దాడి ఉదంతం
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాజంపేట్ మండలం అర్గోండ గ్రామ సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి పై జరిగిన దాడి ఘటన బుధవారం ఎస్పీ కార్యాలయానికి చేరింది.

దిశ, తాడ్వాయి : కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాజంపేట్ మండలం అర్గోండ గ్రామ సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి పై జరిగిన దాడి ఘటన బుధవారం ఎస్పీ కార్యాలయానికి చేరింది. గ్రామ సర్పంచ్ గా ఉన్న ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా తన పై భౌతిక దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లు, దుర్భాషలాడిన సీఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రను కలిసి ఏడు పేజీలతో కూడిన సమగ్ర ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఐదు సంవత్సరాల బాలుడి హత్య కేసులో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్గొండ గ్రామానికి చెందిన హత్యకు గురైన బాలుడి తండ్రి భాస్కర్ తరపున సర్పంచ్ విక్రాంత్ రెడ్డి కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్లో కాల్ రికార్డ్ చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు సర్పంచ్ ఫోన్ లాక్కోని... సీఐ కి కాల్ రికార్డ్ చేస్తున్నాడని కాన్షియబుల్ చెప్పడంతో వాడిని కూడా లోపల వేయండి అని అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల తీరును ప్రశ్నించినందుకు ముగ్గురు కానిస్టేబుళ్లు కొట్టడమే కాకుండా అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ సర్పంచ్ పై భౌతిక దాడికి దిగారాని పేర్కొన్నారు. అక్కడే ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వారిని వారించాల్సింది పోయి, సర్పంచ్‌ను ఉద్దేశించి హాఫ్ నాలెడ్జ్ అంటూ అవమానకర రీతిలో దూషించడమే కాకుండా, హత్య చేసిన నేరస్తుల పక్కనే కూర్చోబెట్టి మరింత అవమానానికి గురి చేశారని ఎస్పీకి చేసిన పిర్యాదులొ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ కి రావాలంటే ముందుగా నా గురించి తెలుసుకొని రావాలని అన్నట్లు పేర్కొన్నారు.స్టేషన్ లోపల జరిగిన పరిణామాలపై, సీఐ ప్రవర్తనపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ముగ్గురు కానిస్టేబుళ్లను, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సీఐ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్‌లో ప్రజాప్రతినిధులకే గౌరవం, రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సర్పంచ్ అందజేసిన ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ రాజేష్ చంద్ర సానుకూలంగా స్పందించారు.






