విద్యుత్ శాఖ నూతన సెక్షన్ కార్యాలయాల ప్రారంభం

by Ratna Kumari |

దిశ, గాంధారి : లింగంపేట్ సబ్ డివిజన్ పరిధిలో ఇవాళ‌ రెండు సెక్షన్ ఆఫీసులు లింగంపేట, శెట్ప‌ల్లి సంగారెడ్డి లను కామారెడ్డి SE శ్రవణ్ కుమార్ ప్రారంభిoచారు.

విద్యుత్ శాఖ నూతన సెక్షన్ కార్యాలయాల ప్రారంభం
X

దిశ, గాంధారి : లింగంపేట్ సబ్ డివిజన్ పరిధిలో ఇవాళ‌ రెండు సెక్షన్ ఆఫీసులు లింగంపేట, శెట్ప‌ల్లి సంగారెడ్డి లను కామారెడ్డి SE శ్రవణ్ కుమార్ ప్రారంభిoచారు. విద్యుత్ వినియోగదరులకు, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేవిధంగా నూతన కార్యాలయ భవనాలను ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇంతకు ముందు సబ్ స్టేషన్ కంట్రోల్ రూమ్ గదిలో సెక్షన్ ఆఫీసులు ఉండేవని, ఇప్పుడు నూతనంగా నిర్మించిన భవనాల్లోకి కార్యాలయాలు మారాయని తెలిపారు. వినియోగ దారులు ఏ సమస్య ఉన్నా 1912 కు కాల్ చేయాలనీ, పంపు సెట్ల వద్ద కెపాసిటర్లు బిగించుకోవాలని, విద్యుత్ వాహకాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించి సహకరించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి DE వై. విజయ సారధి, ADE చికోటి మల్లేశం, AE పి. లక్ష్మయ్య, AE కే. సాయినాథ్, AE యన్. హరీష్ రావు,లైన్ మెన్ md. వాహిద్, రాజా గౌడ్, ప్రసాద్ గౌడ్, అనిల్ పాల్గొన్నారు.

Next Story