ఆకట్టుకున్న కేఓఎస్.. టెక్ ట్రానికా రోబో ఫెస్ట్..

by Disha Web |
ఆకట్టుకున్న కేఓఎస్.. టెక్ ట్రానికా రోబో ఫెస్ట్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థలకు చెందిన కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్ ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. టెక్ ట్రానికా రోబో ఫెస్ట్ పేరుతో నగరంలోని శ్రీరామ గార్డెన్స్ లో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎం దుర్గాప్రసాద్, గౌరవ అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి రఘురాజ్ హాజరయ్యారు. ముఖ్యఅతిధులు విద్యాసంస్థల యజమానులు కలిసి రోబో ఫెస్ట్ ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజలను చేసి ప్రదర్శనలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సుమారు 300లకు పైగా ప్రయోగాలు తయారు చేయడం అభినందనీయమన్నారు. ఒక్కొక్కరు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్ట్స్ తయారు చేయడం ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నయన్నారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కాకతీయ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం రెండు రోజులు కేటాయించి ప్రదర్శనలు చూపించడం సంతోషకరమన్నారు.

పాఠశాల అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పాఠశాల స్థాయి అనగా చిన్ననాటి నుండే విద్యార్థులకు రోబోటిక్స్ పై ప్రయోగాలను తమకు నచ్చిన విధంగా తయారుచేసి ప్రదర్శించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు గొప్పప్రదర్శనలు చేస్తే వాటిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో జిల్లా నుంచి మంచి మంచి శాస్త్రవేత్తలు తయారయ్యే విధంగా ఈ ప్రదర్శనలు ఉన్నాయన్నారు. ఈ టెక్నో పేస్టు ద్వారా కొత్త కొత్త విషయాలను కొత్త కొత్త ప్రాజెక్టులను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.

విశిష్ట అతిధి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారిరఘు రాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఈ ఫెస్ట్ తమ ప్రదర్శనను ప్రదర్శించి ప్రతిభ కనబరిచినందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. తాము చదువుకునే సమయంలో ఇలాంటివి ఏమీ లేవని రోజు రోజుకు టెక్నాలజీలు పెరిగిన కొద్దీ విద్యార్థులు కూడా టెక్నాలజీలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారని ఇదేవిధంగా విద్యార్థులు ముందుకు సాగినప్పుడే తమ లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. అందుకే అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలను ఒలంపియాడ్ పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

అనంతరం రామోజీరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ 21 సంవత్సరాల జనరేషన్ సంబంధించి రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషిన్, వివిధ రకాల పద్ధతులలో సంవత్సర కాలంగా శిక్షణలను ఇస్తున్నామని, ఇంజనీరింగ్ లెవెల్ కు సంబంధించిన ప్రాజెక్టులను, రియల్ లైఫ్ లో జరిగే ప్రాజెక్టులను చాలా కష్టంగా చాలా అందంగా ప్రాజెక్టులను చేయడం తమ పాఠశాలకు గర్వంగా ఉందన్నారు. నూతన టెక్నాలజీకి అనుగుణంగా నూతన పద్ధతులలో 3d డిజైన్లను చేయడం, సెన్సార్లను, గేమ్స్ కూడా కోడింగ్ చేయడం ఎంతో గొప్ప విషయమని తమ పాఠశాల రోబోటిక్స్ సిబ్బందికి, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్లు రజనీకాంత్, తేజస్విని, ప్రిన్సిపల్ గిరిధర్ , నటరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.Next Story