అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లు సీజ్

by Bhanu |

ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరం మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ లను ఆదివారం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు.

అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లు సీజ్
X

దిశ, నిజాంసాగర్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరం మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ లను ఆదివారం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామ శివారులో జెసిబి నంబర్ TS 17L6843 తో పాటు 8 ట్రాక్టర్ ల ద్వారా గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వం అనుమతులు తీసుకోకుండా యదేచ్చగా మొరం అక్రమ రవాణా చేస్తుండగా జెసిబి ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేనిదే మట్టి, మొరం, ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సైతం జప్తు చేసుకుంటామని ఎస్ఐ వెల్లడించారు.

Next Story