- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరిగేషన్ భూమిలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలి..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కొటార్మురు ఏరియాలో గల మున్సిపల్ ఏడవ వార్డు పరిధిలో శ్రీ లక్ష్మీనరసింహ ఇన్ఫ్రా సంస్థ వారు ఇరిగేషన్ భూమి బఫర్ జోన్ స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారని సదరు నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ సోమవారం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇరిగేషన్ భూమిలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలి..
-ఇరిగేషన్ అధికారులకు పూజ నరేందర్ ఫిర్యాదు..
దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కొటార్మురు ఏరియాలో గల మున్సిపల్ ఏడవ వార్డు పరిధిలో శ్రీ లక్ష్మీనరసింహ ఇన్ఫ్రా సంస్థ వారు ఇరిగేషన్ భూమి బఫర్ జోన్ స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారని సదరు నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ సోమవారం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి నిర్మాణానికి ముందు noc సర్టిఫికెట్ సైతం సదరు నిర్మాణదారుడు తీసుకున్నాడని అధికారులకు ఫిర్యాదుల వివరించారు. మరోమారు ఇరిగేషన్ అధికారులు అపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించి గతంలో జారీ చేసిన ఎన్ఓసిని రద్దు చేసి, అక్రమంగా ఇరిగేషన్ భూమిలో నిర్మాణాలు చేపడుతున్న సదరు రియాల్టర్ పై చర్యలు తీసుకొని ఇరిగేషన్ భూమిని కాపాడాలని ఇరిగేషన్ అధికారులను పూజా నరేందర్ కోరారు.






