- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలు
సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో కలిసి జీవించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.

దిశ, నిజాంసాగర్ : సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో కలిసి జీవించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు. బుధవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని.. రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని అన్నారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొంటూ, నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థించారు. ముస్లింలు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మత సామరస్యానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ మత భేదాలు మనుషుల మధ్య దూరాలు పెంచకూడదు, పరస్పర గౌరవం మరియు ప్రేమే సమాజాన్ని బలంగా నిలబెడతాయి అని అన్నారు. అలాగే రంజాన్ పండుగ మనలో సహనం, దయ, సేవా భావాలను పెంపొందించే పవిత్ర సమయం. అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా శాంతి, సౌభ్రాతృత్వంతో జీవించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, జామే మసీద్ మైనారిటీ అధ్యక్షుడు అనీస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వకీల్ రాంరెడ్డి, గుర్రపు శ్రీనివాస్, గౌస్ పటేల్, ప్రజా పండరి, బంగ్లా ప్రవీణ్ కుమార్, అజయ్ రెడ్డి, గాండ్ల రమేష్, అజారుద్దీన్, మేంగారం శ్రీనివాస్, సర్పంచులు బొజ్జ అంజయ్య, సంకు లక్ష్మయ్య, మోహన్ పాల్గొన్నారు.






