వైద్యారోగ్య ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే ఉద్య‌మం త‌ప్ప‌దు: సీఐటీయూ

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి టౌన్ : వైద్యారోగ్య ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే ఉద్య‌మం త‌ప్ప‌దు అని సీఐటీయూ రాష్ట్ర గౌర‌వ అధ్య‌క్షులు భూపాల్ పేర్కొన్నారు. తెలంగాణ యునైటెడ్

వైద్యారోగ్య ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే ఉద్య‌మం త‌ప్ప‌దు: సీఐటీయూ
X

దిశ, కామారెడ్డి టౌన్ : వైద్యారోగ్య ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే ఉద్య‌మం త‌ప్ప‌దు అని సీఐటీయూ రాష్ట్ర గౌర‌వ అధ్య‌క్షులు భూపాల్ పేర్కొన్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కామారెడ్డి జిల్లా మ‌హాస‌భ ఆదివారం నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర గౌర‌వ అధ్య‌క్షులు భూపాల్ హాజ‌రై మాట్లాడారు. మెడికల్ డిపార్ట్ మెంట్ లోని కాంట్రాక్టర్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అందరికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఏఎన్ఎంల పని భారం తగ్గించాలని, 1930 ఏఎన్ఎం పోస్టులు, 2300 నర్సింగ్ ఆఫీసర్స్, 1284 ఎల్ టి, 735 ఫార్మసిస్ట్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆరోగ్య శ్రీ, మిత్రల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 104 ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వాలని, సొంత‌ జిల్లాలో నియమించాలని కోరారు. కామారెడ్డి జిల్లా లోని ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎం, ఫార్మసిస్ట్ లను కాంట్రాక్టు పద్ధతిలో మార్చాలని కోరారు. గవర్నమెంట్‌ జనరల్ హాస్పిటల్ లో 8 మంది డీఈఓ లను తొలగించడం అన్యాయం అన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తామన్నారు. నవంబర్ 9 న రాష్ట్ర మహాసభ సంగారెడ్డిలో ఉంటుందని ఉద్యోగులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటియు గౌరవాధ్యక్షులు చంద్రశేఖర్, తిరుపతి, నాయకులు బాబు, జోత్స్న, సావిత్రి, అల్లాఉద్దీన్, స్వామి, గంగాధర్, అన్నపూర్ణ పాల్గొన్నారు

Next Story