రాహుల్ గాంధీ అరెస్టయితే ప్రజల్లో సింపతి పెరుగుతుంది : మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి

by Disha Web Desk 20 |
రాహుల్ గాంధీ అరెస్టయితే ప్రజల్లో సింపతి పెరుగుతుంది : మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం కావాలని కక్ష్యపూరితంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిందని దానిని రాహుల్ గాంధీ స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నారని, రాహుల్ గాంధీని జైలుకు పంపిస్తే ప్రజల్లో సింపతి పెరుగుతుందని రాష్ట్ర మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యంలో రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని కానీ దేశాన్ని దోచుకున్న నీరవ్ మోడి, లలిత్ మోడిల గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కేసుపెట్టి అనర్హత వేటువేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని 12లక్షల కోట్లకు దోచిన అదానీకి ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు దేశద్రోహం అన్నట్లు మాట్లాడడం దారుణమన్నారు.

దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి జీరో అకౌంట్ లో 15లక్షలు జమచేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర తర్వాత ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూడలేకనే బీజేపీ కక్ష్యపూరిత చర్యలకు దిగుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రజలకోసం, ప్రజాధనం కోసం పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారని, ఇటీవల ఎల్ ఐసీ షేర్లు పతనంతో కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైందని దానిపై జేపీసీ వేయాల్సిందేనని అన్నారు.

రాహుల్ గాంధీ పోరాటాలకు మోడికి, బీజేపీకి కంటిమీద కునుకు లేకుండాపోయిందని అన్నారు. రాహుల్ గాంధీపై పార్లమెంట్ సెక్రటరి అనర్హత వేటు వేయడం దుర్మార్గమని, అప్పీల్ కు సమయం ఇచ్చి వేటువేయడం కక్ష్యసాధింపులో భాగమని సుదర్శన్ రెడ్డి అన్నారు. దేశప్రజలు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వెంటే ఉన్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లాఅధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు ముప్పగంగారెడ్డి, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు రత్నాకర్, సిరికొండ గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed