- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పక్షాన నష్టపరిహారం అందేలా చూస్తా...
గొర్లు మృతి చెంది... సుమారు 14 లక్షల రూపాయలు నష్టపోయిన కుటుంబానికి, ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూస్తానని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ భరోసానిచ్చారు.

దిశ, భిక్కనూరు : గొర్లు మృతి చెంది... సుమారు 14 లక్షల రూపాయలు నష్టపోయిన కుటుంబానికి, ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూస్తానని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ భరోసానిచ్చారు. బుధవారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కందూరి సాయిలు కు చెందిన 140 గొర్లు చనిపోయి, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం నూరిపోశారు. ఎందుకోసం చనిపోయాయి అంటూ వ్యవసాయ శాఖ అధికారి మోనికా రెడ్డిని ప్రశ్నించగా, ఇక్కడ టెస్టులు చేస్తే విష పదార్థం అని తేలిందని, హైదరాబాద్ ల్యాబ్ కు పంపామని, అక్కడి నుంచి రిపోర్టు ఇప్పుడే వచ్చిందని, ఎందుకనేది ఇంకా స్పష్టంగా తెలియ లేదన్నారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ ఆశిష్ సం గ్వాన్ కు ఫోన్ చేసి మాట్లాడి, గొర్లు మృతి చెందిన సాయిలు కుటుంబానికి ప్రభుత్వ పక్షాన నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం మరికొన్ని గొర్లు ఇప్పుడు అప్పుడు అన్నట్లు ఉన్నాయని, మరిన్ని చనిపోకుండా ఉండేందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా హైదరాబాదు నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రోజుల్లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో జరిగే సమావేశంలో, ఈ విషయాన్ని ఎజెండాలో పెట్టిస్తానని ప్రకటించారు. తన వంతు తక్షణ సహాయం గా 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. అధైర్యపడవద్దని అన్ని రకాలుగా అండగా నిలబడతానని సాయిలు ను ఓదార్చారు. ఆయన వెంట రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి భరత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, తహసీల్దార్ సునీత, మండల పశువైద్యాధికారిని మోనికా రెడ్డి, గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి, భిక్కనూరు, గుర్జ కుంట గ్రామ సర్పంచ్ లు బల్యాల రేఖ సుదర్శన్, సామసంతోష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగన్న గారి నరేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తిరుపరి భీమ్ రెడ్డి, వెంకమ్మ గారి బాగారెడ్డి, తుడుంజీవన్, తుడుం ప్రదీప్ తదితరులు ఉన్నారు.






