- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. భార్యను హత్యను చేసిన భర్త..!
దిశ,పెద్ద కొడప్గల్(పిట్లం) : సాధారణంగా భార్య భర్తల బంధం అంటేనే చాలా బలంగా ఉంటుంది. అందుకే చాలా మంది కలిసి మెలిసి సుఖ, సంతోషాలతో ఉంటారు. కానీ

దిశ,పెద్ద కొడప్గల్(పిట్లం) : సాధారణంగా భార్య భర్తల బంధం అంటేనే చాలా బలంగా ఉంటుంది. అందుకే చాలా మంది కలిసి మెలిసి సుఖ, సంతోషాలతో ఉంటారు. కానీ కొందరూ మాత్రం కేవలం పది మందిని మెప్పించడానికి..ఫోటో పోజులకే అన్నట్టుగా వ్యవహరిస్తుననారు. అయితే తాజాగా పెద్ద కోడప్గల్ విట్టల్ వాడి తాండాకు చెందిన కిషన్ తన భార్య సునితను బండరాయితో బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కిషన్ కి సునిత కు 25 ఏళ్ల క్రితం పెళ్లి జరిపించారు. ప్రస్తుతం ఓ కొడుకు కూతురు సంతానం కలరు. కుటుంబం మొత్తం గత కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాదులోని లింగంపల్లి ప్రాంతంలో చాయ్ కొట్టు పెట్టుకొని అక్కడే జీవిస్తుండే వరని అప్పుడప్పుడు ఇంటిదగ్గర ఏదైనా కార్యక్రమాలు పండగలు ఉంటే విటల్వాడి తండాకు వచ్చేవారు గత కొన్ని సంవత్సరాలుగా కిషన్ మద్యానికి బానిసై తన భార్య ను అనుమానిస్తూ ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు రెండు రోజుల క్రితం విటల్వాడి తండాలో గుడి పండుగ ఉన్నదని ఆ కుటుంబం విటల్వాడి తండాకు వచ్చినారు తేదీ 23 న రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడగా భర్త కిషన్ సవితను రుబ్బురాయి రోలు తో తలపై కొట్టగా ఆమెకు బలమైన గాయమైనది ఆపడానికి వచ్చిన తాండవాసులను కూడా కిషన్ గాయపరిచినాడు రక్తపు మడుగులో కొనవుపిరితో ఉన్న సవితను బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె చనిపోయినది.ఆమె చనిపోయినది అని మృతురాలి అన్న జాదాపూల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు బిచ్కుంద సీఐ రవికుమార్ పెద్ద కొడప్గల్ ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.






