బురకా తీయకుండా ఓటర్ ను ఎలా గుర్తిస్తారు

by Disha Web Desk 15 |
బురకా తీయకుండా ఓటర్ ను ఎలా గుర్తిస్తారు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ముస్లిం మహిళలు బురకాలు తీయకుండా ఓట్లు వేయడం పట్ల నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మైనార్టీ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖిల్లా రోడ్డులోని గోల్డేన్ జూబ్లి పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో బురకాలు ధరించిన మహిళలు కొందరు అక్కడ ఓట్లు వేసేందుకు నిలబడి ఉండగా ఈ విషయంపై పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారిని ఎంపీ అరవింద్ నిలదీశారు. పోలింగ్ కేంద్రంలోకి బురకాలు తీయకుండా వచ్చిన మహిళలను ఎలా అనుమతిస్తారని అన్నారు. ఫేస్ చూడకుండా ఎట్లా అనుమతిస్తున్నారు అని ప్రశ్నించారు.

ఎలక్షన్ కమిషన్ రూల్ ఎమిటి, మీరు డ్యూటీ సరిగ్గా చేయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ చేస్తున్నారా మీరు ఎం చేస్తున్నారు ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకుండా ఎలా ఓట్లు వేయనిస్తున్నారు అని నిలదీశారు. పోలింగ్ ఏజెంట్లు ఉన్నారని పీఓ సమాధానం ఇవ్వగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ తెలియవా అని ప్రశ్నించారు. బురకాలు తియకుంటే ఓటు వేయొద్ధు అన్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అంతకుముందు పోలింగ్ బూత్ వద్ధ బీజేపీ కార్యకర్తను పోలీస్ లు అకారణంగా

స్టేషన్ కు తీసుకుపోయారని తెలిసి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ధ యువత గుమికూడి ఉండటంపై పోలీస్ అధికారులను ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల వద్ధ 144 సెక్షన్ అమలు జరుగుతుందా అని ఆరా తీశారు. డిపార్ట్ మెంట్ అంతా చెంచాగిరి అవుతుందని మండిపడ్డారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బురకాలు లేని మహిళలకు మాత్రమే ఓటు హక్కు కలిపించాలని ఎన్నికల కమిషన్ కు అరవింద్​ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed