పేకాట‌రాయుళ్ల‌కు స‌మాచారం అందిస్తున్న హోంగార్డు స‌స్పెండ్

by Ratna Kumari |

దిశ‌, కామారెడ్డి : పేకాట రాయుళ్లకు పోలీసులు వస్తున్నారనే సమాచారం చేర‌వేస్తున్నాడనే నెపంతో హోం గార్డ్ ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ

పేకాట‌రాయుళ్ల‌కు స‌మాచారం అందిస్తున్న హోంగార్డు స‌స్పెండ్
X

దిశ‌, కామారెడ్డి : పేకాట రాయుళ్లకు పోలీసులు వస్తున్నారనే సమాచారం చేర‌వేస్తున్నాడనే నెపంతో హోం గార్డ్ ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పిట్లం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ కె. సాయా గౌడ్ (HG-732 పెట్రోల్ కార్ డ్రైవర్, MT విభాగం) పేకాట ఆడే వ్యక్తులతో అనుచిత సంబంధాలు కొనసాగిస్తూ.. పోలీసు బృందాలు జూద స్థావరాలపై దాడులు చేపట్టే సమయాల్లో వారి కదలికల సమాచారాన్ని ముందుగా అందజేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించేవారు క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో మెలగాలన్నారు. ఈ విలువలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story