- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బందోబస్తు విధులకు హాజరై తిరిగి లోకేశ్వరంకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా అడవి పంది అడ్డు రావడంతో దానిని ఢీ కొట్టి హోంగార్డ్ మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.

దిశ ,లోకేశ్వరం: గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బందోబస్తు విధులకు హాజరై తిరిగి లోకేశ్వరంకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా అడవి పంది అడ్డు రావడంతో దానిని ఢీ కొట్టి హోంగార్డ్ మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.
గ్రామస్తులు, ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని గడ్ చందా గ్రామానికి చెందిన తుంగెన నర్సింగ్ రావు (51) 2003 సంవత్సరం నుండి లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్రకు బందోబస్తు నిర్వహించేందుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు. శోభాయాత్ర ముగిసిన అనంతరం తిరిగి లోకేశ్వరం కు వస్తుండగా రాత్రి 10:30 గంటల సమయంలో మోహల సమీపంలో ద్విచక్ర వాహనానికి అడవి పంది అడ్డు రావడంతో దానిని ఢీ కొట్టి రోడ్డుపై పడిపోయాడు. అతను ధరించిన హెల్మెట్ ఎగిరి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ మార్గం నుండి వెళ్లేవారు లోకేశ్వరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎస్సై చికిత్స కోసం వైన్సాకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య గతంలో మరణించగా ఇరువురు కుమార్తె పెళ్లిళ్లు పూర్తయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- Home guard died






