ఊరికి ఉపకారి.. మోహిన్ అహ్మద్ ఖాద్రి

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయ వాది మోహిన్ అహ్మద్ ఖాద్రి కుల మతాలకతీతంగా ఉచిత సేవలు అంది స్తూ " ఊరికి ఉపకారి"గా నిలుస్తున్నాడు.

ఊరికి ఉపకారి.. మోహిన్ అహ్మద్ ఖాద్రి
X

దిశ‌, లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయ వాది మోహిన్ అహ్మద్ ఖాద్రి కుల మతాలకతీతంగా ఉచిత సేవలు అంది స్తూ " ఊరికి ఉపకారి"గా నిలుస్తున్నాడు. తాను పుట్టి పెరిగిన ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలను సైతం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎన్నో అభివృ ద్ధి పనులను చేయిస్తున్నా డు. తాను సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని బడుగు బలహీన, పేద వర్గాల ప్రజలకు అంద జేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఆర్థిక సేవలందిస్తూ " మనసున్న మానవతా వాది"గా పేరు సంపాదించు కున్నారు.

నాలుగు వందల మందికి పింఛన్ల పంపిణీ

లింగంపేట గ్రామానికి చెందిన హైకోర్టు సీనియర్ లాయర్ మోహిన్ అహ్మద్ ఖాద్రి ప్రతి నెల 400 మంది కి ఉచితంగా ఒక్కొక్కరికి రూ. 200 చొప్పున, పింఛన్లను అందజేస్తు న్నారు. లింగంపేట మెంగారం, ఐలాపూర్, లింగంపల్లి తదితర గ్రామాలకు చెందిన పేద ప్రజలకు పెన్షన్లను అందిస్తున్నారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ, రంజాన్ పండుగలకు వందలాది మంది వేద మహిళలకు చీరలను, రంజాన్ తోపాలను అందిస్తున్నారు. లింగంపేట మండలంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతు న్నారని తెలుసుకున్న మోహిన్ అహ్మద్ ఖాద్రి గత ఐదేళ్లలో తన సొంత ఖర్చులతో 40 బోర్ బావులను తవ్వించి ప్రజల దాహార్తిని తీర్చి ఘనత సాధించారు. లింగంపేట, ఐలాపూర్, సూరాయిపల్లి, లింగంపల్లి, ముస్తాపూర్, మేంగారం, శెట్పల్లి, అయ్య పల్లి,పర్మల్ల తదితర గ్రామాల్లో లక్షలు వెచ్చించి బోర్ బావులను తవ్వించా రు. వాటికి మోటార్లను బిగించి పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడంలో సఫలీకృతుడ య్యాడు.

మందిర నిర్మాణాలకు భారీగా విరాళాలు

లింగంపేట మండలంలో నూతనంగా నిర్మించే మందిరాల నిర్మాణాలకు భారీగా విరాళాలు అంద జేస్తూ మతసామ రస్యానికి ప్రత్యేకంగా నిలుస్తున్నారు మోహిన్ అహ్మద్ ఖాద్రి. లింగంపేట మండల కేంద్రంలో ఈ ఏడాది నూతనంగా నిర్మించిన శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి మందిర నిర్మాణానికి రూ.10 లక్షలు, శ్రీ మత్తడి పోచమ్మ మందిర నిర్మాణానికి రూ. 10 లక్షలు, శ్రీ రేణుక ఎల్ల మ్మ మందిర నిర్మాణానికి రూ.8 లక్షలు, హనుమాన్ టెంపుల్ పునరుద్ధరణ పనులకు రూ. 4 లక్షలు, మెం గారం గ్రామం లోని మజీద్ పునరుద్ధరణ పనులకు రూ. రెండు లక్షలు, గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవా లాల్ మందిర నిర్మాణానికి రూ. ఐదు లక్షలు విరా ళంగా అందజేసి తన ఉదారతను చాటుకు న్నాడు. అలాగే లింగంపేటలోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు డెస్కులు బెంచీలను అందించారు. రూ. రెండు లక్షల వ్యయం తో స్టేజిని నిర్మించారు. ప్రభుత్వ జూనియర్ కళా శాలలో రెండు లక్షల వ్యయంతో స్టేజిని నిర్మించారు. లింగంపేట గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని లక్ష్యంతో నీటి శుద్ధి యంత్రం ఏర్పాటుకు రూ. ఐదు లక్షలు వెచ్చించి గదిని నిర్మించారు.రూ. 20 లక్షల వ్యయంతో మను షుల అంతిమ యాత్రకు ఉపయోగపడే వైకుంఠ రథాన్ని కొనుగోలు చేసి లింగంపేట గ్రామపంచాయ తీకి అప్పగించారు.

100 హెల్మెట్ల పంపిణీ

యువకులకు హెల్మెట్ ధరించడం పైన అవగాహన కల్పించడం కోసం గత ఏడాది జనవరి 16 లింగంపేటలో అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్ వన్, జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి చేతుల మీదుగా వంద మందికి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహిం చారు.ఇలా తన వంతు సాయంగా అన్ని వర్గాల ప్రజలకు, కుల మతాలకు అతీతంగా సేవలందిస్తున్న హైకోర్టు సీనియర్ లాయర్ మోహిన్ అహ్మద్ ఖాద్రి ఖ్యాతిని గడిస్తున్నారు.

Next Story