భారీగా రేషన్ బియ్యం పట్టివేత

by Ratna Kumari |

దిశ‌, మాక్లూర్ : మాక్లూర్ మండ‌లం మామిడిప‌ల్లి శివారులో గ‌ల వైభ‌వ్ రైస్ మిల్లులో అక్ర‌మంగా ఉన్న రేష‌న్ బియ్యాన్ని గుర్తించిన‌ట్టు ఎస్సై రాజ‌శేఖ‌ర్ తెలిపారు. స్పెషల్

భారీగా రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ‌, మాక్లూర్ : మాక్లూర్ మండ‌లం మామిడిప‌ల్లి శివారులో గ‌ల వైభ‌వ్ రైస్ మిల్లులో అక్ర‌మంగా ఉన్న రేష‌న్ బియ్యాన్ని గుర్తించిన‌ట్టు ఎస్సై రాజ‌శేఖ‌ర్ తెలిపారు. స్పెషల్ బ్రాంచి పోలీసుల సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం దాడి చేసి దాదాపు 385 క్వింటాల్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటి విలువరూ. 11,55,600 గా ఉన్నట్లు వెల్ల‌డించారు. ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి అమ్రాద్ గ్రామంలోని వెంకటేశ్వరా రైస్ మిల్లులో బియ్యాన్ని భద్రపరిచ్చినట్లు చెప్పారు. నిందితులు ఎల్లయ్య, సంజీవ్, రైస్ మిల్ యజమాని నాగేష్, బాలాజీ, డ్రైవర్ సోహెల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

Next Story