- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్ లో భారీ వర్షం.. ఇళ్లలోకి వచ్చిన వరద నీరు
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గురువారం కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గురువారం కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో గోవింద్ పెట్, చేపూర్, పిప్రి, మంథని తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల జలమయం కావడంతో ఇళ్లలోకి వర్షపు వరద నీరు చేరింది. వరద నీరు ఇళ్ళలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కమలా నెహ్రూ కాలనీలో బండరాయి జారిపడి ఓ ఇల్లు ధ్వంసం అయింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ, సిక్కుల కాలనీ, విద్యానగర్ కాలనీ, యోగేశ్వర కాలనీ, మామిడిపల్లి చౌరస్తా, కోటార్ మూర్, పెరికిట్లలోని లోతట్టు ప్రాంతాలు భారీ వర్షానికి జలమయ మయ్యాయి. దింతో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాలను జలమయమైన కాలనీలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.
- Tags
- Heavy rain
- Armur






