- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాచారెడ్డి ఉర చెరువు శిఖం భూమి కబ్జాపై నేడు విచారణ
దిశ ఎఫెక్ట్ :- ట్టకేలకు కదిలిన ప్రభుత్వ యంత్రాంగం

మాచారెడ్డి ఉర చెరువు శిఖం భూమి కబ్జాపై నేడు విచారణ
- ఎట్టకేలకు కదిలిన ప్రభుత్వ యంత్రాంగం
- దిశ ఎఫెక్ట్
దిశ, మాచారెడ్డి: మాచారెడ్డి ఊర చెరువు శిఖం భూమి కబ్జా పై పంచాయతీరాజ్, నీటి పారుదల, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా నేడు క్షేత్రస్థాయిలో విచారణ జరపనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారుడితో పాటు సంబంధిత అధికారులు శిఖం భూమిలో కబ్జాలో ఉన్న వ్యక్తులకు సమాచారం అందించారు. గత మార్చి నెల నుంచి మాచారెడ్డి చెరువు శిఖం భూమి కబ్జాకు గురైన విషయాన్ని 'దిశ' వరస కథనాలను అందించింది. శిఖం భూమికి ఇంటి పెరడు జాగగా ఓనర్ షిప్ ధ్రువీకరణ పత్రాలు స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి జారీ చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా శిఖం భూమిని విక్రయిస్తూ వ్యాపారం చేశారు. ఇదే విషయాన్ని దిశ కథనాల్లో స్పష్టం చేసింది. ఈ విషయంలో గ్రామ కార్యదర్శిని బదిలీ చేసి సరిపెట్టారు. నేటి సర్వే, క్షేత్రస్థాయి పరిశీలనలో నిజం నిగ్గు తేల్చి అక్రమార్కులపై చర్యలు ఉంటాయా..? అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.






