- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
by velandi.Saikiran |
మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో సోమవారం మండల వైద్యాధికారి డాక్టర్ రక్షిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ

X
దిశ, ఏర్గట్ల: మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో సోమవారం మండల వైద్యాధికారి డాక్టర్ రక్షిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తన సిబ్బందితో పాటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం త్రివేణి సహకారంతో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చాలా అవసరమని, పాఠశాలలలో తరచుగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. పరిశుభ్రత పాటించటం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి అంశాలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని సుంకరి సంధ్య, ఆరోగ్య పర్యవేక్షకులు పండరి, కల్పన, స్వప్న, పరిశీలకులు విజయ, ఆశ వర్కర్లు భారతి, సులోచన, స్వరూప, నవ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






