రోడ్డు ప్ర‌మాదంలో హెడ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

రోడ్డు ప్ర‌మాదంలో హెడ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న రామారెడ్డి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్ర‌మాదంలో హెడ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు
X

దిశ‌, స‌దాశివ‌న‌గ‌ర్ (రామారెడ్డి) : రోడ్డు ప్ర‌మాదంలో హెడ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న రామారెడ్డి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజ‌శేఖ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రామారెడ్డి పోలీస్ స్టేష‌న్ లో రాజ‌న‌ర్స‌య్య‌(56) హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వ‌హిస్తుంటాడు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండ‌గా రామారెడ్డి స‌మీపంలోని హెచ్ పి పెట్రోల్ పంప్ వద్ద బైకు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీ కొట్టాడు. ఈ ప్ర‌మాదంలో హెడ్ కానిస్టేబుల్ రాజ‌న‌ర్స‌య్య‌కి తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం కామారెడ్డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు ఎస్సై రాజ‌శేఖ‌ర్ తెలిపారు.

Next Story