- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ టెండర్ లో దక్కిన దుకాణానికి ధర పెంచాలంటూ వేధింపులు
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ ఆర్టీసీ డిపో కాంప్లెక్స్ లో ఉన్న రెండు మడిగలకు ఆన్ లైన్ లో టెండర్

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ ఆర్టీసీ డిపో కాంప్లెక్స్ లో ఉన్న రెండు మడిగలకు ఆన్ లైన్ లో టెండర్ నిర్వహించగా.. మడిగెలను దక్కించుకున్న యజమానులకు ధర పెంచి మడిగెను తీసుకోవాలని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని బాధితుడు రతన్ వినోద్, సంతోష్ లు చెప్పారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపో కాంప్లెక్స్ లో గత 20 సంవత్సరాల నుంచి మొబైల్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మడిగే గడువు ముగియడంతో గత నెల 4న మడిగెను ఆన్ లైన్ లో ఆర్టీసీ అధికారులు టెండర్ కు ఆహ్వానించారని తెలిపారు. ఈ ఓపెన్ ఆన్ లైన్ టెండర్ లో పాల్గొనడానికి ఆర్టిసి సంస్థకు డిడి రూ. 50 వేలు చెల్లించినట్లు తెలిపారు. ఇది కాక టెండర్ ఫామ్ ను రూ.1770, పెన్ డ్రైవ్ ను రూ.3,500 లకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ ఓపెన్ టెండర్ లో రూ.10, 100 కి ఆన్ లైన్ లో నిర్వహించిన వేలం పాటలో రూ.10, 100 కు దక్కించుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్యాలయం వారు మడిగను అలర్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఆన్ లైన్ ఆర్టీసీ వారి టెండర్ లో అధిక డబ్బులకు పలికి మడిగెను దక్కించుకున్న తర్వాత ఆర్ఎం కార్యాలయం నుంచి రూ. 5 వేలు ఎక్కువ చెల్లించి మడిగే తీసుకోవాలని వేధిస్తున్నారని చెప్పారు. టెండర్ లో పాడిన పాట కంటే రూ 5000 వేలు అధికంగా చెల్లించాలని లేని పక్షంలో మడిగే ను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. టెండర్ లో దక్కించుకున్న మడిగెను ఆర్టీసీ వారు రద్దు చేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం ఓపెన్ ఆన్ లైన్ టెండర్ లో పాల్గొని దక్కించుకున్న ఆర్టీసీ మడిగెను నిబంధనల ప్రకారం గడువు మేరకు తనకు అప్పగించాలని ఆయన కోరారు. అధిక డబ్బులు చెల్లించాలని వేధింపులను విరమించుకోవాలన్నారు.






