- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలి
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మొదలుకుని ఈ సంవత్సరమంతా అందరికీ శుభాలు కలగాలని, అనుకున్న పనులన్నీ అవలీలగా నెరవేరాలని కోరుకుంటున్నట్లు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టిసుమన్ కుమార్ అన్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 30: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మొదలుకుని ఈ సంవత్సరమంతా అందరికీ శుభాలు కలగాలని, అనుకున్న పనులన్నీ అవలీలగా నెరవేరాలని కోరుకుంటున్నట్లు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టిసుమన్ కుమార్ అన్నారు. శ్రీవిశ్వవసు నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉగాది సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పశుపతి శర్మ ఆధ్వర్యంలో పూజాధి కైంకర్యాలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని రాశుల వారికి ఈ సంవత్సరంలో సర్వశుభాలు కలగాలని,ప్రత్యేకపూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం ఉగాది పచ్చడితోపాటు ప్రసాదాలు కూడా అందజేశారు. కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ , కార్యదర్శి నేతికుంట శేఖర్ , టీఎన్జీవో కేంద్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, జిల్లా కోశాధికారి దినేష్ బాబు, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జ్ఞానేశ్వర్ రెడ్డి,కె. శ్రీనివాస్, భీంగల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, సర్వే యూనిట్ కార్యదర్శి సతీష్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు గురు చరణ్, సునీల్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ , క్లాస్ ఫోర్ యూనియన్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు నేరెళ్ల శ్రీనివాస్,వీరేందర్ సింగ్, ప్రసాద్ ఎన్జీవో మాజీ మహిళా కార్యవర్గ సభ్యురాలు వసుమతి దేవి తదితరులు హాజరయ్యారు.






