- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడ్వాయి ఇంటర్‌లో గురుకుల గెలుపు.. ప్రభుత్వ కాలేజీ వెనుకంజ..?
మండల కేంద్రంలోని ఇంటర్ విద్యాసంస్థలు ఫలితాల్లో భిన్నమైన ప్రదర్శన కనబరిచాయి. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తాడ్వాయి గురుకుల మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలోని ఇంటర్ విద్యాసంస్థలు ఫలితాల్లో భిన్నమైన ప్రదర్శన కనబరిచాయి. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తాడ్వాయి గురుకుల మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫలితాలు గత ఏడాదితో పోలిస్తే కొంత మెరుగు కనబడింది. తాడ్వాయి గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ చాటారు. ప్రథమ సంవత్సరం 49 మంది పరీక్ష రాయగా 36 మంది పాసై 73.46 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం మొత్తం 60 మంది విద్యార్థినులకు 50 మంది ఉత్తీర్ణత సాధించి 83.33 శాతం ఫలితాలను నమోదు చేశారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా గురుకుల విద్యార్థినులు సాధించిన ఈ ఫలితాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గురుకుల ఇంటర్ మొదటి సంవత్సరంలొ ఎన్. ప్రణతి (ఎంపీసీ)...470 మార్కులకు గాను 453 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. కె. ప్రిన్సి (బైపీసీ), 440 మార్కులకు 411 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. గురుకుల ఇంటర్ ద్వితీయ సంవత్సరంలొ రచన (బైపీసీ) 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచింది. ఎం. శ్రీజ (ఎంపీసీ)... 940 మార్కులతో తన ప్రతిభను చాటుకుంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫలితాలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చర్చనీయాంశంగా మారింది. గత విద్యాసంవత్సరంలో 161 మంది విద్యార్థులకు 84 మంది (52.17శాతం) ఉత్తీర్ణత సాధించగా..ఈ ఏడాది ఆ స్థాయి ఫలితాలు నమోదు కాలేదు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం 52 మందిలో కేవలం 20 మంది మాత్రమే గట్టెక్కి (38.46)శాతంతో సరిపెట్టుకున్నారు...ద్వితీయ సంవత్సరం..55 మందికి గాను 27 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు (49.09)శాతం నమోదు అయ్యాయి. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సాయి సుశాంత్ గౌడ్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం 1000 మార్కులకు గాను 919 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ వీరమళ్ళి రష్మిత 470 మార్కులకు గాను 453 కాలేజీ టాపర్ గా నిలిచింది. మొదటి సంవత్సరంలో సగానికి పైగా విద్యార్థులు వెనుకబడిపోవడం గమనార్హం.
మెరుగుపడాల్సిన అవసరం ఉంది
ఫలితాల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి, రాబోయే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వారిని సన్నద్ధం చేస్తామని కళాశాల అధ్యాపక బృందం తెలిపింది. ప్రతిభ చాటిన టాపర్లను, విజేతలను మండల ప్రముఖులు, తల్లిదండ్రులు అభినందించారు.






