- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల పాఠశాల విద్యార్థికి పాముకాటు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఉదయం పాము కాటు వేసింది.

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఉదయం పాము కాటు వేసింది. దీంతో విద్యార్థిని హుటాహుటిన జీజీహెచ్ కు తరలించగా అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు.
కామారెడ్డి మండలం సారంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో గాంధారి మండలం జెమినీ తండాకు చెందిన బానోత్ చరణ్ పదవ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. అయితే రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఉపాధ్యాయులు విద్యార్థులకు టీ బ్రేక్ ఇచ్చారు. దీంతో చరణ్ పాఠశాల మైదానంలోకి రాగానే ఎడమ కాలు పాదం పైన పాము కాటు వేసింది. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ అతనికి చికిత్స కొనసాగుతోంది.
Next Story






