- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

దిశ, కామారెడ్డి : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొట్టమొదట మార్చి 8, 1977న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని తెలిపారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ లోని మహిళా సాధికారత కేంద్రం బేటి బచావో బేటి పడావో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. మహిళా దినోత్సవ థీమ్, స్త్రీల పురోగతి, మహిళలు ఇంట్లో, బయట కూడా అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతిభ కనబరుస్తూ, పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఇంటి పనులే కాకుండా బయటి పనులను సైతం నిర్వహిస్తున్నారని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ప్రతీ పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని నియమించడం జరిగిందని, 1100 మంది చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులను నియమించామని తెలిపారు. మహిళా శక్తి పథకం క్రింద కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు హార్డ్ వర్క్ చేయాలన్నారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జడ్జి నాగరాణి మాట్లాడుతూ.. మహిళలు వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని అన్నారు. అనంతరం మహిళలను శాలువా, మెమొంటో లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని ప్రమీల, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని స్రవంతి, ఐసిడిఎస్ సిబ్బంది, సి.డి.పి.ఒ.లు, విద్యార్థినిలు పాల్గొన్నారు.






