బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిలిపేసిన గొల్లపల్లి -చీర్కపల్లి రిజర్వాయర్ : సీపీఎం నాయ‌కులు మ‌హేష్

by Ratna Kumari |

గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేయ‌గా.. ప్ర‌జానికం అభిష్టం, ఒత్తిడి మేర‌కు ర‌ద్దు చేసుకుంద‌ని, అదే రిజ‌ర్వాయ‌ర్ ప్ర‌తిపాద‌న‌ను రూ.1800 కోట్ల క‌మీష‌న్ల కోసం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌స్తుతం త‌లకెత్తుకున్నార‌ని సీపీఎం మండ‌ల నాయ‌కుడు గ‌డ్డిగోపుల మ‌హేష్ ఓ ప్ర‌క‌టన‌లో తెలిపారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిలిపేసిన గొల్లపల్లి -చీర్కపల్లి రిజర్వాయర్ :  సీపీఎం నాయ‌కులు మ‌హేష్
X

దిశ‌, రేవ‌ల్లి : గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేయ‌గా.. ప్ర‌జానికం అభిష్టం, ఒత్తిడి మేర‌కు ర‌ద్దు చేసుకుంద‌ని, అదే రిజ‌ర్వాయ‌ర్ ప్ర‌తిపాద‌న‌ను రూ.1800 కోట్ల క‌మీష‌న్ల కోసం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌స్తుతం త‌లకెత్తుకున్నార‌ని సీపీఎం మండ‌ల నాయ‌కుడు గ‌డ్డిగోపుల మ‌హేష్ ఓ ప్ర‌క‌టన‌లో తెలిపారు. ఈ రిజర్వాయర్ కు వ్యతిరేకంగా ఇక్కడి గ్రామస్తుల కోరిక మేరకు అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్షంగా ఏర్పడి 16రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇది కేవలం బీఆర్ఎస్ నాయకుల నిరసన దీక్ష అనడం వారి రాజకీయ అవివేకం ఆయన అన్నారు. ఈ నిరసన దీక్ష ఇక్కడి ప్రజల జీవనపోరాట దీక్ష అని ఈ ప్రజాఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు చులకన చేస్తూ ప్రకటనలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని, ఈ రిజర్వాయర్ ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story