గాలి ప‌టం కోసం వెళ్లి.. చిన్నారికి తీవ్ర‌ గాయాలు

by Ratna Kumari |

గాలి ప‌టం కోసం వెళ్లి విద్యుత్ తీగ‌ల‌కు త‌గిలి ప‌దేళ్ల బాలుడు తీవ్ర గాయాల‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న ఆర్మూర్ మున్సిప‌ల్ ప‌ట్ట‌ణ కేంద్రంలోని వ‌డ్డెర కాల‌నీలో చోటు చేసుకుంది.

గాలి ప‌టం కోసం వెళ్లి.. చిన్నారికి  తీవ్ర‌ గాయాలు
X

దిశ‌, ఆర్మూర్ : గాలి ప‌టం కోసం వెళ్లి విద్యుత్ తీగ‌ల‌కు త‌గిలి ప‌దేళ్ల బాలుడు తీవ్ర గాయాల‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న ఆర్మూర్ మున్సిప‌ల్ ప‌ట్ట‌ణ కేంద్రంలోని వ‌డ్డెర కాల‌నీలో చోటు చేసుకుంది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ ఏరియాలో గల మున్సిపల్ 5 వ వార్డులో వడ్డెర కాలనీ ఏరియాలో ఓ చిన్న చిరు కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. నర్ర గణేష్-శారదా దంపతుల చిన్న కుమారుడు నర్ర రోహిత్ గాలిపటం కోసం వెళ్లి విద్యుత్ ప్రమాదానికి గురై గురువారం సాయంత్రం తీవ్ర గాయాల పాలైన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వ‌చ్చింది. వడ్డెర కాలనీలో సంక్రాంతి పండగ వస్తున్న నేపథ్యంలో పిల్లలు ముందస్తుగా గాలిపటాలను ఎగరవేస్తుంటారు. కొన్ని కొన్ని గాలిపటాలు తెగిపోయి, చెట్లకు, విద్యుత్ వైర్లకు చిక్కుకోవడంతో గాలి పటాలను ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ప్రమాదాన్ని పసిగట్టకుండా చిన్నారులు ముందు వెనక ఆలోచించకుండా విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదే తరహాలో 10 సంవత్సరాల వయసు గల నర్ర రోహిత్ గాలిపటం కోసం వెళ్లి ప్రమాదకరంగా విద్యుత్ తీగల కు తగిలి తీవ్ర గాయాల పాల‌య్యాడు. దీంతో ఆ బాలుడిని వారి తల్లిదండ్రులు నర్ర గణేష్ శారద లు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తిరుమల ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. కడు పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాకు మా కుమారుడు విద్యుత్ ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని వారు కోరారు. కానీ సంక్రాంతి పర్వదినం సందర్భంగా సమాజంలోని తల్లిదండ్రులందరూ వారి వారి పిల్లలను తగు జాగ్రత్తలతో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా విద్యుత్ తీగల దూరంగా, ఇంటి పైన గల డాబాలపైన జాగ్రత్తలు తీసుకునేలా పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ అధికారులు సైతం ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలు కోరుతున్నారు.

Next Story