ఘ‌నంగా పైడి ఎల్లారెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు

by Nallavelli.Anjaneyulu |

బీజేపీ రాష్ట్ర నాయ‌కులు, శాస్త్ర‌వేత్త పైడి ఎల్లారెడ్డి జ‌న్మదిన వేడుక‌లు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘ‌నంగా పైడి ఎల్లారెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు
X

దిశ‌, ఎల్లారెడ్డి : బీజేపీ రాష్ట్ర నాయ‌కులు, శాస్త్ర‌వేత్త పైడి ఎల్లారెడ్డి జ‌న్మదిన వేడుక‌లు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి అనంతరం బీజేపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పంచిపెట్టుకొని ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైడి ఎల్లారెడ్డి ఎప్పుడు ప్రజాసేవలో ముందు ఉంటాడని ప్రజా సేవకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు రాజేష్, సీనియర్ నాయకులు బత్తిని దేవేందర్, బాలారాజ్, వంగపల్లి కాశీనాథ్, నాగిరెడ్డిపేట మాజీ ఎంపీపీ రాజు దాస్ పాల్గొన్నారు.

Next Story