- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు ఉపాధ్యాయులకు గెజిట్ నోటీస్...
కామారెడ్డి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారి ఝలక్ ఇచ్చారు.

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారి ఝలక్ ఇచ్చారు. సుమారు 10 ఏళ్లుగా ఎలాంటి సెలవు పత్రం లేకుండా, అధికారుల అనుమతి లేకుండా పాఠశాలకు వెళ్లని ఇద్దరు ఉపాధ్యాయులను వివరణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి గెజిట్ నోటీసు జారీ చేశారు. సదాశివనగర్ మండలం తిమ్మాజీవాడి మండల పరిషత్ పాఠశాల ఎస్జీటీ పాండురంగం, బీబీపేట మండలం తుజాల్ పూర్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు స్వామి గత కొన్నేళ్లుగా జిల్లావిద్యాశాఖ అధికారి అనుమతి లేకుండా, కనీసం సెలవు పత్రం కూడా లేకుండా పాఠశాలకు రావడం మానేశారు.
ఈ విషయమై వారిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ముందుగా వారి నుంచి వివరణ తీసుకునేందుకు గెజిట్ నోటీస్ ఇచ్చామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.






