జిల్లా ఉత్తమ ఏపీఎంగా గంగాధర్ ఎంపిక

by Nallavelli.Anjaneyulu |

జిల్లాలో ఏర్గట్ల మండలాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్‌ను జిల్లా ఉత్తమ ఏపీఎంగా ఎంపిక చేశారు.

జిల్లా ఉత్తమ ఏపీఎంగా  గంగాధర్ ఎంపిక
X

దిశ, ఏర్గట్ల : జిల్లాలో ఏర్గట్ల మండలాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్‌ను జిల్లా ఉత్తమ ఏపీఎంగా ఎంపిక చేశారు. సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాల పంపిణీ, నూతన సంఘాల ఏర్పాటు, ఎంటర్‌ప్రైజెస్ స్థాపన అంశాలలో వంద శాతం లక్ష్యాలను సాధించడమే కాకుండా రికవరీలోనూ జిల్లాలో ఏర్గట్ల మండలం అగ్రస్థానంలో నిలిచినందుకు ఈ అవార్డు లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు, డీఆర్‌డీఓకు, అదనపు డీఆర్‌డీఓకు ఏపీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు సాధనలో సహకరించిన సీసీ రవికుమార్, మండలంలోని వీవోఏలు, ఆపరేటర్ సుప్రియ, మహిళా సంఘాల ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.

Next Story