- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీల్లో నిధుల కటకట
నిజామాబాదు జిల్లా వ్యాప్తంగా 545 గ్రామపంచాయతీలు ఉన్నాయి పల్లెల్లో బతుకమ్మ, దసరా పండగ ఏర్పాట్ల నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు కష్టతరంగా మారుతోంది.

పంచాయతీల్లో నిధుల కటకట
నిధులు లేక ప్రశ్నార్థకంగా మారిన పండుగల నిర్వహణ
ఆర్థిక భారంతో తలలు పట్టుకుంటున్న కార్యదర్శులు
జిల్లా అంతటా ఇదే పరిస్థితి
ఎంపీడీవోలకు మొరపెట్టుకుంటున్న పంచాయతీ సెక్రటరీలు
దిశ, ఆలూర్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 545 గ్రామపంచాయతీలు ఉన్నాయి పల్లెల్లో బతుకమ్మ, దసరా పండగ ఏర్పాట్ల నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు కష్టతరంగా మారుతోంది. పండగ నిర్వహణకు సంబంధించి నిధులు రాకపోవడం జిల్లా వ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారింది. సర్పంచ్ ల పదవీకాలం ముగిసి వచ్చే ఫిబ్రవరితో రెండేళ్లు కావస్తోంది. గడిచిన పందొమ్మిది నెలలుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే గ్రామ పంచాయతీల పాలన కొనసాగుతోంది. రోజువారీగా ఎదురయ్యే సమస్యలు,సవాళ్లకు సరైన సమాధానం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో దొరకలేదన్న విమర్శలు క్షేత్ర స్థాయిలో వెల్లువెత్తడం సాధారణంగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం రెండేళ్లుగా నిధులు సమకూరపోవడం,ఆశించిన స్థాయిలో గ్రామ స్థాయి అభివృద్ధి జరగకపోవడం అసలు కరంగా తెలుస్తోంది.
పైసలెట్ల...ఖర్చులెవరు పెట్టాలే...
గ్రామ పంచాయతీలో నిధులు అరకొరా అయిన లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు బెంభేలెత్తుతున్నారు. గ్రామాల్లో నిన్నా మొన్నటి వరకు కొట్టిన వర్షాలతో దాదాపు అన్ని వాడల రోడ్లు బురదమయ్రంగా మారి అక్కడక్కడ పెద్ద మొత్తంలో గుంతలు సైతం ఏర్పడ్డాయి. వీటికి పెద్ద మొత్తంలో మొరం పోయాల్సి వస్తుంది. చాలా చోట్ల వెలగని లైట్లను సరిచేస్తూనే గ్రామం మొత్తం వీధి లైట్లను ఏర్పాటు చేయాలి. బతుకమ్మ ఆడే ప్రాంతాలు చెరువు, కుంటల ప్రదేశాల్లో మొరం పోసి చదును చేయాలి. డీజే లాంటివి ఈ ఖర్చుకు అదనంగా ప్రతీ గ్రామంలో చేయాల్సి ఉంటుంది.వీటికి దాదాపు రూ. 25 వేల నుంచి 50 వేల వరకు జీపీని బట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఐతే ఎన్నికలు త్వరగా జరుగుతాయని ఆశించిన కార్యదర్శులకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా జీపీల నిర్వహణ, పండగల కోసం అప్పులు చేయడంతో పాటుగా సొంత డబ్బులు వెచ్చించిన కార్యదర్శులకు ఈ ఏడాది బతుకమ్మ, దసరా తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోంది.
పంచాయతీ కార్యదర్శులపై ఖర్చుల భారం
గ్రామ పంచాయతీలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాతాల్లో డబ్బులు లేక, అత్యవసర పనులకు ఖర్చు చేయలేక సతమతమవుతున్నారు. పైపుల లీ కేజీ మరమ్మతు, పంచా యతీ ట్రాక్టర్ నెలవారీ బ్యాంకు ఇన్స్టాల్మెంట్, గ్రామా ల్లో విద్యుత్ దీపాలు, నెలనెలా విద్యుత్ బకాయిలు.. ఇవన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే. ఇప్పటికే ఒక్కో గ్రామ పంచాయతీ రూ. యాభై నుంచి రూ.2 లక్షల వరకు అప్పు చేసి చెల్లిస్తున్నారు. పంచాయతీల భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ కార్యదర్శుల మీటింగ్లో ఇకనుండి గ్రామ పంచాయతీలకు తమ సొంత డబ్బును ఉపయోగించేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది.
నిర్ధిష్ట జాబ్ చాట్ లేని ఉద్యోగాలు
(ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక నిర్దిష్టమైన జాబ్ చాట్ అనేది ఉంటుంది, కానీ మా పంచాయతీ కార్యదర్శులకు ఒక నిర్దిష్ట జాబ్ చార్జ్ అంటూ ఏదీ లేదని వాపోతున్నారు. 'గ్రామపంచాయతీలలో నిర్వర్తించాల్సిన విధులతోపాటు బయటి పనులు కూడా ప్రభుత్వం పురమాయిస్తుండడంతో పంచాయతీ కార్యదర్శి అంటే ఇలా ఉంటుందా అంటూ కొందరు.నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒక పని అయిపోయిన తర్వాత మరొక పనిని, మరొక పని అయిపోయిన తర్వాత ఇంకో పని అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు చేసేదేమీ లేక ఆ పథకాలకు సంబంధించి అయిష్టంగానే విధులు నిర్వర్తిస్తున్నారు.
రెండు నెలల నుంచి వేతనాలు లేవు
గ్రామ పంచాయతీ సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం చూపకపోవడాన్ని చూసి పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారని, గ్రామాల్లో పారిశుద్ధ కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక, కొంతమంది కార్యదర్శులు వ్యక్తిగతంగా ఫండ్ ఉపయోగించి సిబ్బందికి వేతనాలు ఇచ్చినట్లు సమాచారం.






