- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని, తెలంగాణ రాష్ట్రంలో పేదల పెన్నిధిగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగిస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతిరెడ్డి అన్నారు.

దిశ, నిజామాబాద్ రూరల్ : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని, తెలంగాణ రాష్ట్రంలో పేదల పెన్నిధిగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగిస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతిరెడ్డి అన్నారు. శనివారం డిచ్ పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రూరల్ నియోజక వర్గం పరిధిలోని డిచ్ పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాలకు చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్ కాపీలు పంపిణీ చేశారు. 246 మంది లబ్దిదారులకు రూ. 2, 46, 28, 536 లు విలువ చేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులు, 153 లబ్ధిదారులకు రూ.7,65,00,000 విలువ చేసే ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు పంపిణీ చేశారు.
ఇటీవల మరణించిన డిచ్ పల్లిఎంపీపీ మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ల మరణం పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కానీ సంక్షేమ ఫలాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుందని, రానున్న మూడేళ్‌లలో సంక్షేమ ఫలాలు అమలుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపెల్లి సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, యువ నాయకులు ఉమ్మాజి నరేష్, హన్మండ్లు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






