- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలూర్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
ఆలూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.

దిశ, ఆలూర్ :ఆలూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల గురించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ ..సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్పి సంతోష్, ఉదయ్, హెచ్ఎం యోగేష్ , ఏఎన్ఎంలు జామున, రాజగంగు, ఆశా వర్కర్స్ జామున, నాగలత, పద్మ, భూలక్ష్మి, ఎలిజిబిట్ తదితరులు పాల్గొన్నారు.






