- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కజొన్న తూకంలో మోసం
బాన్సువాడ మండలం, హన్మాజీపేట్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ సిబ్బంది మొక్కజొన్న తూకంలో క్వింటాల్ కు 3 నుంచి 4 కిలోలు తూకంలో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు.

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలం, హన్మాజీపేట్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ సిబ్బంది మొక్కజొన్న తూకంలో క్వింటాల్ కు 3 నుంచి 4 కిలోలు తూకంలో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. రైతులు ఫోన్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆర్డీఓ రవీందర్ రెడ్డి సంఘటన స్థలానికి సిబ్బంది తో చేరుకున్నారు. సొసైటీ కి చెందిన కాంటకు ప్రైవేట్ కాంటకు కిలోనర 1.5 నుంచి రెండు 2 కిలోల వ్యత్యాసం కనిపించిందనీ కిలోనర నుంచి రెండు కిలోలు ఎక్కువ జోకినట్లు ప్రాథమికంగా తేలిందని. తూకం తనిఖీ చేసేందుకు అధికారులను పిలిచి నిర్ధారణ చేసి సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకూడదని సొసైటీ సిబ్బందికి హెచ్చరించారు. ఈ ధర్నాలో సంగ్రామ్ నాయక్, బోనాల సాయిలు, ప్రవీణ్ గౌడ్ రైతులు పాల్గొన్నారు.






