నాలుగేళ్ల బాలిక పై అత్యాచారయ‌త్నం..?

by Nallavelli.Anjaneyulu |

కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండ‌లంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల బాలిక పై అత్యాచారయ‌త్నం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

నాలుగేళ్ల బాలిక పై అత్యాచారయ‌త్నం..?
X

దిశ‌, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండ‌లంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల బాలిక పై అత్యాచారయ‌త్నం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. గ్రామానికి చెందిన చిన్నారి బుధ‌వారం అంగ‌న్ వాడికీ వెళ్తుండ‌గా.. అదే గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువ‌కుడు చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార‌య‌త్నం చేసిన‌ట్టు స‌మాచారం. అంగ‌న్ వాడీ టీచ‌ర్, ఆయా చిన్నారి కోసం వెళ్ల‌గా.. స‌ద‌రు యువ‌కుడు బాలిక‌ను ఇంట్లోకి తీసుకెళ్లిన‌ట్టుగా గ్రామ‌స్తులు గుర్తించారు. ఆ యువ‌కుడి ఇంటి త‌లుపులు తెరిచి ఇంట్లో ఉన్న‌ చిన్నారినీ తీసుకెళ్లి పోలీసుల‌కు స‌మాచారం అందించిన‌ట్టు స‌మాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story