కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల ను రద్దు చేయాలి : TUCI

by Ratna Kumari |

కార్మికుల‌కు వ్య‌తిరేకంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబ‌ర్ కోడ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని టీయూసీఐ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ద‌గ్ధం చేశారు.

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల ను రద్దు చేయాలి : TUCI
X

దిశ, ఆర్మూర్ : కార్మికుల‌కు వ్య‌తిరేకంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబ‌ర్ కోడ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని టీయూసీఐ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ద‌గ్ధం చేశారు. ఈ సంద‌ర్భంగా ట్రేడ్ యూనియ‌న్ సెంట‌ర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూర‌ల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్య‌క్షులు మ‌త్త‌న్న మాట్లాడుతూ అనేక సంవ‌త్స‌రాల నుంచి కార్మికులు కొట్లాడి క‌ష్టాల‌ను ఎదుర్కొని కార్మిక చ‌ట్టాల‌ను సాధించుకున్నార‌ని తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎనిమిది గంట‌ల ప‌ని దినాల‌ను సాధించుకొని.. వాటిని అమ‌లు చేస్తున్న ప‌లు కంపెనీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనంగా రెండు గంటలకు పెంచి 10 గంటల పని దినం, 12 గంటల పని దినం కార్మికులు పనిచేయాలని చట్టం తీసుకొచ్చిండ్రు అన్నారు.


దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలంగా వివరించే పద్ధతిని భారత దేశంలో నరేంద్ర మోడీ అమలు చేయించడం సిగ్గు చేటు అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 01 నుంచి అమలు చేయడానికి ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని, వాటిని వెంటనే విరమించు కోవాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(TUCI ) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా జిల్లా కమిటీ వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి.అరవింద్, ఆర్మూర్ మండల నాయకులు ఎండి. నజీర్, ఎన్.నిఖిల్, బీడీ చాటింగ్ కార్మికులు, బీడీ ప్యాకర్స్ బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Next Story