మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత

by Kodari Anjali |

బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో ఆరవ తరగతి నుండి పదవతారతి వరకూ చదువుకుంటున్న విద్యార్థులకు ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.

మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
X

దిశ, బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో ఆరవ తరగతి నుండి పదవతారతి వరకూ చదువుకుంటున్న విద్యార్థులకు ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గుడ్ల కూరతో భోజనం చేసిన అనంతరం ఫుడ్ పాయిజన్ అయి వంతులు విరేచనాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, వారిలో 12 మందికి తీవ్ర విరేచనాలు, వాంతులు రావడంతో కళాశాల యాజమాన్యం వెంటనే అంబులెన్సుల ద్వారా విద్యార్థులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు.

ఘటనపై కొనసాగుతున్న విచారణ..

నిన్న ఉదయం వాడిన మంచి నూనెను రాత్రి పూరీలకు వాడడం వల్ల అది కలుషితంగా మారి పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ సోమవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తాము తినే ఆహారంలో పదేపదే వాడిన నూనె లేదా నాణ్యతలేని నూనె ఉపయోగించడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని కొందరు విద్యార్థులు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్‌పై సర్పంచ్ ధర్మతేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని వారికి ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని హెచ్చరించారు. కాగా, ఫుడ్ పాయిజన్‌కు గల ఖచ్చితమైన కారణం వైద్యుల నివేదిక లేదా అధికారుల విచారణ అనంతరం మాత్రమే నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Next Story