- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లింగంపేటలో ముదిరిన ఫ్లెక్సీ వివాదం

దిశ, తాడ్వాయి : అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని లింగంపేట మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వివాదంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసాయి. స్థానికుల కథనం మేరకు.. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గ్రామపంచాయతీ సిబ్బంది ఒక్కరివే తొలగించడంతో.. దీనికి నిరసనగా దళిత సంఘాల సభ్యులు రోడ్డుపై బైఠాయించి మూడు గంటల పాటు నిరసన తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దళిత సంఘ నాయకుడు మాజీ ఎంపీపీ మూదాం సాయిలు,భూపతి లను పోలీస్ స్టేషన్ తలలించే క్రమంలో ముధం సాయిలు అర్ధనాగ్నంగా మారినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ తరలించారు. పలు సంఘాల నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారికి మద్దతుగా నిరసనను తెలియజేశారు.
సీఐపై చర్యలు తీసుకోవాల్సిందే.. జాజాల సురేందర్
దళిత సంఘ నాయకుడు మాజీ ఎంపీపీ ముదాం సాయిలును అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లింగంపేట మండల కేంద్రంలోని కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి సీఐపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో.. పరిస్థితి ఉదృతంగా మారింది. దీంతో డిఎస్పి శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకొని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను సమదాయించడంతో పాటు.. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తలలించిన వారిని వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశించడంతో బీఆర్ఎస్ నాయకులు శాంతించారు.
ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట కవిత
అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఊహకందని క్రూరత్వం, పాలనకు ఎంత అవమానకరమైన ప్రతిబింబం. ఇది డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగమా..? లేక సిఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత రూల్ బుక్ కాదా..? లింగంపేట్ మండలం కామారెడ్డిలో దళితులను పోలీసులు బట్టలు విప్పి, అవమానించి, అరెస్టు చేశారు, దేనికి? అంబేద్కర్ జయంతి కోసం బ్యానర్లు పెడుతున్నారా? పోలీసులు ప్రజాసేవకులుగా కాకుండా వికృత మూకల్లా ప్రవర్తించారు. పై నుండి తమకు రక్షణ ఉందని తెలియకపోతే ఎలాంటి పోలీసులు ఇలాంటివి చేయడానికి ధైర్యంగా భావిస్తారు? ఇది క్రూరత్వం మాత్రమే కాదు, ఇది ద్వేషపూరిత నేరం. ఈ అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తు సంబంధిత అధికారులను తక్షణం సస్పెండ్ చెయ్యాలన్నారు. ఆలస్యం చేయకుండా బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూనే ప్రభుత్వం నుంచి బహిరంగ క్షమాపణ ఆమె డిమాండ్ చేసారు. ఇది లా అండ్ ఆర్డర్ కాదు, ఇది లక్ష్యం అణచివేత. దాడికి గురైన ఏ స్వరాన్ని మూగబోనివ్వబోము అని ఆమె అన్నారు.